Nani: ఆద్యంతం ఉత్కంఠ‌భరితంగా 'పెంగ్విన్' ట్రైలర్.. విడుదల చేసిన నాని

  • కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'పెంగ్విన్'
  • ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో సినిమా
  • తప్పిపోయిన కుమారుడిని వెతికే పాత్ర‌లో కీర్తి
Nani Happy to launch the trailer of Penguin

ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన 'పెంగ్విన్' సినిమా తెలుగు ట్రైలర్‌ను యంగ్ హీరో నాని విడుదల చేశాడు. ఈ ట్రైలర్‌ను విడుదల చేయడం పట్ల సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నాడు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాష‌న్ స్టూడియోస్ ప‌తాకంపై నిర్మించిన ఈ సినిమాపై ఈ ట్రైలర్‌‌ ఆసక్తిని పెంచుతోంది.

తప్పిపోయిన కుమారుడిని వెతికే పాత్ర‌లో కీర్తి సురేశ్ న‌టించింది. మరోపక్క అతడి కోసం పోలీసులు కూడా అడవిలో వెతుకుతున్నట్లుగా ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా ఉంది. ట్రైలర్ చివ‌రిలో ఓ సైకో ఎవ‌రినో న‌రుకుతూ క‌నపడతాడు.

ఈ సినిమాను 'పేట' సినిమా దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు నిర్మించారు. ఇటీవ‌లే  విడుదలైన ‘పెంగ్విన్’ టీజర్‌, ఫ‌స్ట్ లుక్‌ల‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.  ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్ ద్వారా దీనిని విడుదల చేస్తున్నారు.

More Telugu News