Vijay Devarakonda: తన పెళ్లి గురించి అడిగితే ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హీరో విజయ్‌ దేవరకొండ

  • మా కుటుంబ సభ్యులు కూడా పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు
  • అందుకు ఓ సమయం అంటూ ఉంటుంది
  • నేనింకా చిన్నపిల్లాడిననే భావిస్తాను
  • పెళ్లి చేసుకుంటే తప్పకుండా అన్ని భార్యతో పంచుకోవాలి
vijay devarakonda about his marriage

తన పెళ్లి గురించి అడిగితే సినీ హీరో విజయ్‌ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.  ఈ సందర్భంగా తన పెళ్లి ఎప్పుడని  యాంకర్ ప్రశ్నించారు. దీనికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ...  తన కుటుంబ సభ్యులు కూడా పెళ్లి చేసుకోమని అడుగుతున్నారని, తనకు కూడా కుటుంబ జీవితం అంటే చాలా ఇష్టమని చెప్పాడు.

కుటుంబ జీవితం‌ అంటే వివాహం, పిల్లలు అందులో భాగమేనని విజయ్ దేవరకొండ చెప్పాడు. అయితే, అందుకు ఓ సమయం అంటూ ఉంటుందని, పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టాలంటే తాను మానసికంగా మరింత పరిణతి చెందాలని చెప్పాడు. తాను ఇంకా ఎదగాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. తాను  ఇప్పటికీ ఒక చిన్నపిల్లాడిగానే భావిస్తున్నానని అన్నాడు. పెళ్లి జరగకముందు నచ్చిన పని చేయవచ్చని, పెళ్లి చేసుకుంటే తప్పకుండా అన్ని భార్యతో పంచుకోవాల్సి ఉంటుందని అన్నాడు. అలా చెప్పడం ఒక బాధ్యతని, ఆ బంధాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంటుందని ఆయన తెలిపాడు.

More Telugu News