Nara Lokesh: ఈ ఐదు సూత్రాలు కచ్చితంగా పాటించి కరోనా వ్యాప్తిని అరికడదాం: నారా లోకేశ్

  • రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి
  • లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం
  • ఆరోగ్య సూత్రాలను ట్వీట్ చేసిన నారా లోకేశ్
Nara Lokesh says we can avoid corona with these five measures

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కరోనా నివారణ చర్యలను ట్విట్టర్ లో వివరించారు. ఈ మేరకు ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియో చివర్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సందేశాన్ని కూడా జతచేశారు.

లోకేశ్ చెప్పిన ఐదు సూత్రాలు ఇవే...

  •  వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండాలి.
  • తరచుగా చేతులను కడుగుతూ ఉండండి.
  • దగ్గినా, తుమ్మినా మీ చేతులను తప్పనిసరిగా అడ్డుపెట్టుకోండి.
  • ముఖాన్ని అసలు ముట్టుకోవద్దు.
  • సామాజిక దూరం కచ్చితంగా పాటించండి.
ఈ ఐదు సూత్రాలను పాటించడం ద్వారా కరోనాను ఆమడదూరంలో ఉంచొచ్చని నారా లోకేశ్ తెలిపారు. కాగా, కరోనా విజృంభణతో తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 31 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. జనజీవనం కూడా బాగా మందగించింది.

More Telugu News