Corona Virus: కరోనా సమయంలో మంచి బహుమతి వచ్చింది.. ఫొటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

  • రీయూజబుల్ కరోనా మాస్కును పంపిన స్నేహితుడు
  • ఆయనకు ధన్యవాదాలు చెబుతూ మహీంద్రా పోస్టు
  • ఈ పోస్టుకు ఓ వైపు లైకులు.. మరో వైపు విమర్శలు
Anand Mahindra Gets Best Gift From Friend Amid Coronavirus Scare

దేశంలో మెల్లగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు ఓ మంచి బహుమతి వచ్చిందట. ఆయనే ఈ విషయాన్ని చెబుతూ, శుక్రవారం ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. తనకు బహుమతిగా వచ్చిన కరోనా మాస్క్ ఫొటోను పోస్టు చేశారు.

రీయూజబుల్ మాస్కు పంపారని..

ఆనంద్ మహీంద్రాకు ఆయన స్నేహితుడు అశోక్ కురియన్  ఒక రీయూజబుల్ (మళ్లీ మళ్లీ వాడగలిగే) ఎన్95 మాస్కును బహుమతిగా పంపించారు. తనకు ఆ బహుమతిని పంపిన అశోక్ కురియన్ ను ప్రశంసిస్తూ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

‘‘ప్రస్తుత సమయంలో మంచి బహుమతిని పంపిన నా స్నేహితుడు అశోక్ కురియన్ కు ధన్యవాదాలు. భారతీయ శాస్త్రవేత్తకు చెందిన స్విస్ కంపెనీ ఈ మాస్కులను తయారు చేసింది. వైరస్ చనిపోయేలా ఉతికి, మళ్లీ మళ్లీ వాడటానికి వీలుగా దీనిని తయారు చేశారు. లివిన్ గ్రాడ్ కంపెనీ ఇండియాలో దానిని తయారు చేయడం మొదలుపెట్టింది.” అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.

విమర్శలు కూడా వచ్చాయి

ఆనంద్ మహీంద్రా చేసిన పోస్టుకు లైకులతోపాటు విమర్శలు కూడా వచ్చాయి. మాస్కుల వల్ల వైరస్ లు చనిపోవని, వదంతులు వ్యాప్తి చేయవద్దని కొందరు ట్విట్టర్ యూజర్లు విమర్శించగా.. కంపెనీలకు ప్రచారం చేయడం ఏమిటని మరికొందరు ప్రశ్నించారు.

More Telugu News