Anand Mahindra: ఈ వీడియో చూసిన వెంటనే ఆంటీలకు అభిమానిగా మారిపోయా: ఆనంద్ మహీంద్రా

  • పుణేలో మధ్య వయసు మహిళ తెగువ
  • ఫుట్ పాత్ పై బైకు నడుపుతున్న యువకుడ్ని అడ్డుకున్న వైనం
  • ఆ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
  • మహిళా దినోత్సవం సందర్భంగా ఆమెను సత్కరించాలని సూచన
  • లేదంటే మరో తేదీన అంతర్జాతీయ ఆంటీల దినోత్సవం జరపాలని పిలుపు
Anand Mahindra comments on Pune woman who stops footpath rider

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరోసారి సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర పోస్టు చేశారు. ఇటీవలే పుణేలో గోఖలే అనే ఓ మధ్య వయసు ఉపాధ్యాయురాలు ఫుట్ పాత్ పై బైకు నడుపుతున్న యువకుడ్ని ధైర్యంగా నిలువరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు.

ఈ వీడియోలో కనిపించిన మహిళ తెగువ తనను విపరీతంగా ఆకట్టుకుందని, ఈ వీడియోతో తాను ఆంటీలకు అభిమానిగా మారిపోయానని వెల్లడించారు. ఆమె తెగువ అంతటితో ఆగిపోరాదని, మరింత బలం చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ పుణే మహిళను సత్కరించాలని సూచించారు. లేని పక్షంలో మరో తేదీన అంతర్జాతీయ ఆంటీల దినోత్సవం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

More Telugu News