Sunni Waqf board: అయోధ్యలో ప్రత్యామ్నాయ భూమికి యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు అంగీకారం

  • ఐదు ఎకరాలను ఎలా వినియోగించుకోవాలో సోమవారం నిర్ణయం
  • మసీదు నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటు చేయనున్న బోర్డు
  • దానికి ‘ఇండో ఇస్లామిక్ కల్చర్ ఫౌండేషన్’ పేరు పెట్టే అవకాశం
Sunni Waqf board accepts alternate land

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని అడ్డంకులు తొలగిపోతున్నాయి. మసీదు నిర్మాణం కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాల ప్రత్యామ్నాయ భూమికి యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు అంగీకారం తెలిపింది. అయోధ్య నగరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నిపూర్ అనే గ్రామంలో ఉన్న ఈ భూమిని ప్రభుత్వం ఈ నెల ఐదో తేదీనే కేటాయించగా.. వక్ఫ్ బోర్డు శుక్రవారం ఓకే చెప్పింది. అదే సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ధిక్కరించే స్వేచ్ఛ తమకు లేదంది.

మసీదు నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన ఈ భూమిని ఎలా వినియోగించుకోవాలో ఈ నెల 24న జరిగే సమావేశంలో చర్చించాలని నిర్ణయించింది. ఈ విషయంలో వివిధ రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్థలంలో పాఠశాల కట్టాలని కొందరు చెబుతుంటే.. ఆసుపత్రి నిర్మించాలని మరికొందరు సూచిస్తున్నారు. దీనిపై సోమవారం జరిగే భేటీలో స్పష్టత రానుంది. అలాగే, మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డు ఓ ట్రస్టును కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీనికి ‘ఇండో ఇస్లామిక్ కల్చర్ ఫౌండేషన్’ అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం.

More Telugu News