Payal Rajputh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పాత్రలో పాయల్ 
  • యాక్షన్ దృశ్యాల చిత్రీకరణలో 'నారప్ప' 
  • పూరి దర్శకత్వంలో పవన్ సినిమా?

 *  అందాలతార పాయల్ రాజ్ పుత్ తాజాగా ఎయిర్ ఫోర్స్ ఫైటర్ గా విభిన్నమైన పాత్రను పోషించనుంది. ప్రముఖ దర్శకుడు జయంత్ పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ మూవీ 'నరేంద్ర'లో పాయల్ ఈ పాత్రలో నటించనుంది. నూతన నటుడు నిలేష్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు.
*  వెంకటేశ్ కథానాయకుడుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న 'నారప్ప' చిత్రానికి సంబంధించిన యాక్షన్ దృశ్యాల చిత్రీకరణ ప్రస్తుతం జరుగుతోంది. పీటర్ హెయిన్స్ నేతృత్వంలో వీటిని తమిళనాడులోని కురుమాలై ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు.
*  పవన్ కల్యాణ్ రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చి మళ్లీ ఇప్పుడు సినిమాలలో బిజీ అయిన సంగతి విదితమే. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయన మూడు చిత్రాలలో నటిస్తున్నారు. అలాగే ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కూడా ఓ చిత్రాన్ని చేయనున్నట్టు తాజాగా వార్తలొస్తున్నాయి.  

More Telugu News