Himalayas: ఐటీబీపీ సాహసం... మంచుకొండల్లో, 17 వేల అడుగుల ఎత్తున మువ్వన్నెల రెపరెపలు!

  • లడఖ్ లోకి వెళ్లిన బృందం
  • జెండాను ఎగురవేసి సాహసం
  • దేశవ్యాప్తంగా వైభవంగా వేడుకలు

మంచుకొండల్లో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించిన ఐటీబీపీ (ఇండో టిబెటన్ బెటాలియన్ సైన్యం) దాదాపు 17 వేల అడుగుల ఎత్తున త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించింది. దాదాపు 10 మందికి పైగా సభ్యులు గల బృందం, లడఖ్ ప్రాంతంలోని కొండలను అధిరోహించి, అక్కడ మువ్వన్నెల జెండాను రెపరెపరాడించింది. ఈ సందర్భంగా పలువురు ప్రభుత్వ పెద్దలు ఐటీబీపీ దళం సాహసాన్ని అభినందించారు. కాగా, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతన్నాయి. రాజ్ పథ్ లో జరిగిన వేడుకల్లో రుద్ర, ధ్రువ్ హెలికాప్టర్లు, స్కై గ్లాడియేటర్స్ చేసిన విన్యాసాలు, పారాచూట్ రెజిమెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

More Telugu News