Vizag: విశాఖకు భారీ నిధులను కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం

  • 7 జీవోల ద్వారా రూ. 394.50 కోట్ల విడుదల
  • ప్లానెటోరియం కోసం రూ. 37 కోట్లు
  •  చుక్కవానిపాలెంలో రహదారి నిర్మాణం కోసం రూ. 90 కోట్లు

విశాఖను రాజధానిగా ఏర్పాటు చేసే దిశగా తొలి అడుగు పడింది. పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అభివృద్ధి పనులకు 7 జీవోల ద్వారా రూ. 394.50 కోట్ల నిధులను విడుదల చేసింది.

ఇందులో కైలాసగిరి ప్లానెటోరియం కోసం రూ. 37 కోట్లు, కాపులుప్పాడు బయో మైనింగ్ ప్రాసెస్ ప్లాంట్ కోసం రూ. 22.50 కోట్లు, సిరిపురం జంక్షన్ లో వాణిజ్య సముదాయం కోసం రూ. 80 కోట్లు, నేచురల్ హిస్టరీ పార్క్ కోసం రూ. 88 కోట్లు, చుక్కవానిపాలెంలో రహదారి నిర్మాణం కోసం రూ. 90 కోట్లు, సమీకృత మ్యూజియం, బీచ్ రోడ్డులో భూగర్భ పార్కింగ్ కోసం రూ. 40 కోట్లు, ఐటీ సెజ్ నుంచి బీచ్ రోడ్డు నిర్మాణం కోసం రూ. 75 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

More Telugu News