Salaries: వినాయక చవితికి పైసలేవి?... ఒకటో తేదీ వచ్చినా జీతాలు, పెన్షన్లు లేవు!

  • ఒకటో తేదీన ఆదివారం
  • సోమవారం నాడు వినాయక చవితి
  • మంగళవారమే ఖాతాల్లోకి వేతనాలు

ప్రతి నెలా ఒకటో తేదీ రాగానే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ దారులు తదితరుల బ్యాంకు ఖాతాల్లో పడిపోయే వేతనాలు ఈ నెలలో మాత్రం పడట్లేదు. బ్యాంకు ఖాతాల్లో వేతనాలు 3వ తేదీన మాత్రమే పడే అవకాశాలు ఉండటంతో, వినాయక చవితిని ఎలా జరుపుకోవాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒకటో తేదీన ఆదివారం, రెండో తేదీన వినాయక చవితి పండగ ఉన్నాయన్న సంగతి తెలిసిందే. దీంతో ఎవరికీ వేతనాలు లభించే పరిస్థితి లేదు. రెండు రోజుల ఆలస్యంగా వేతనాలు పడతాయని ఆర్థిక శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.

More Telugu News