Nampaly: నాంపల్లి రైల్వే స్టేషన్ కు ఒంటరిగా వెళ్లకండి... మతితప్పి తిరిగి మామూలు స్థితికి వచ్చిన డాక్టర్ సంచలన వ్యాఖ్యలు!

  • 2017లో మతిస్థిమితం కోల్పోయిన సునందా సాహి
  • రెండేళ్ల చికిత్స అనంతరం కోలుకోగా బంధువులకు అప్పగింత
  • మోయినాబాద్ లో మెడిసిన్ చేసిన సునంద
  • రైల్వే స్టేషన్ లో ఏం జరిగిందో మాత్రం మిస్టరీయే

"నాంపల్లి రైల్వే స్టేషన్ కు ఒంటరిగా ఎవరూ వెళ్లకండి. ఎవరైనా తోడుగా వస్తేనే వెళ్లండి" 2017లో మతిస్థిమితం కోల్పోయి, ప్రస్తుతం కోలుకున్న డాక్టర్ సునందా సాహి చేసిన సంచలన వ్యాఖ్యలివి. ఆసలు ఏం జరిగిందో మాత్రం వెల్లడించేందుకు నిరాకరించిన ఆమె, తానింక నాంపల్లికి ఒంటరిగా వెళ్లబోనని చెప్పడం గమనార్హం. రెండేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయిన స్థితిలో నాంపల్లి పోలీసులకు ఈమె కనిపించగా, కస్తూర్బా గాంధీ అనాధాశ్రమానికి తరలించి చికిత్స చేయించి మామూలు మనిషిని చేశారు.

మోయినా బాద్ లో ఉన్న మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివిన సునందను వారణాసిలో ఉండే ఆమె మేనత్తకు అప్పగించారు. ఇకపై వైద్యవృత్తిలో ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నట్టు ఆమె చెప్పగా, నాడు నాంపల్లిలో ఏం జరిగిందో ఆధారాలు తమకు లభించలేదని డీసీపీ అనసూయ వ్యాఖ్యానించారు. ఆధారం లభిస్తే విచారిస్తామన్నారు. మరికొన్ని రోజుల తరువాత అసలు ఏం జరిగిందన్న విషయాన్ని ఆమె నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పారు. 

More Telugu News