Krishna District: చంద్రబాబును రాజకీయంగా భూస్థాపితం చేస్తాం: కొడాలి నాని

  • చంద్రబాబు ఓ దుర్మార్గుడు
  • ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని కొట్టేశాడు
  • ఈ ఎన్నికల్లో చంద్రబాబును ఇంటికి పంపడం ఖాయం

చంద్రబాబు నాయుడిని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని, ఈ విషయంలో తాను ముందుంటానని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు ఓ దుర్మార్గుడని తాను మొదటి నుంచి చెబుతున్నానని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని కొట్టేసి, ఆయన పదవిని లాక్కుని మృతికి కారకుడయ్యాడని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబును ఇంటికి సాగనంపడం ఖాయమని జోస్యం చెప్పారు. ‘ఫ్యాన్’ గుర్తుకు ఓటేసి వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని కొడాలి నాని కోరారు.

More Telugu News