niharika: 'సూర్యకాంతం'తో పరిచయమవుతోన్న మరో కొత్త నాయిక

  • 'సూర్యకాంతం' పాత్రలో నిహారిక
  •  మరో నాయికగా పెర్లిన్ భెసానియా
  • 'పూజ' పాత్ర నాకు బాగా నచ్చింది        

ప్రణీత్ దర్శకుడిగా .. నిహారిక ప్రధాన పాత్రధారిగా 'సూర్యకాంతం' నిర్మితమైంది. త్వరలోనే ప్రేక్షకులను పలకరించడానికి ఈ సినిమా ముస్తాబవుతోంది. ఇటీవల వదిలిన ఈ సినిమా ట్రైలర్లో మరో అందమైన హీరోయిన్ మెరిసింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఎవరనే ఆసక్తి అందరిలో పెరుగుతూ వచ్చింది. ఈ సినిమాలో రాహుల్ విజయ్ సరసన మరో కథానాయికగా నటించిన ఆ అమ్మాయి పేరు 'పెర్లిన్ భెసానియా'.

ఈ ముంబై ముద్దుగుమ్మ చాలా యాడ్స్ లో చేసినట్టుగా సమాచారం. తెలుగులో మాత్రం అమ్మడికి ఇదే తొలి సినిమా. తాజాగా ఈ సుందరి స్పందిస్తూ .. 'నిజానికి నాకు తెలుగు రాదు .. హిందీలో డైలాగ్స్ రాసుకుని చెప్పాను. ఈ సినిమాలో నేను చేసిన 'పూజ' పాత్ర నాకు మంచి క్రేజ్ తీసుకొస్తుందని భావిస్తున్నాను. నిహారికతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా విడుదలకాకముందే వరుస అవకాశాలు వస్తుండటం సంతోషాన్ని కలిగిస్తోంది" అని చెప్పుకొచ్చింది.

More Telugu News