Jammu And Kashmir: పాక్ ప్రగల్భాలే... జవాన్ కిడ్నాప్ అవాస్తవమన్న రక్షణ శాఖ!

  • సెలవుపై ఇంటికి వచ్చిన మహమ్మద్ యాసిన్
  • కిడ్నాప్ నకు గురయ్యారని కుటుంబీకుల ఫిర్యాదు
  • క్షేమంగానే ఉన్నారన్న రక్షణ శాఖ

జమ్ముకశ్మీర్‌కు చెందిన మహమ్మద్ యాసిన్ అనే జవాన్‌ ను ఉగ్రవాదులు అపహరించారంటూ వచ్చిన వార్తలను కొద్దిసేపటి క్రితం రక్షణ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. జమ్ముకశ్మీర్‌ లైట్‌ ఇన్ ఫ్యాంట్రీలో పని చేస్తున్న యాసిన్ ను నిన్న సాయంత్రం, అతని ఇంటి నుంచి కిడ్నాప్ చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

మార్చి 30 వరకూ సెలవు పెట్టుకున్న యాసిన్, తన స్వగ్రామానికి వస్తే, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతన్ని బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులే స్వయంగా పోలీసులను ఆశ్రయించారు. దీనిపై రక్షణ ఇచ్చిన విదేశాంగ శాఖ జవాన్ కిడ్నాప్ పై వదంతులను నమ్మవద్దని, ఆయన ఇంటివద్దనే క్షేమంగా ఉన్నారని పేర్కొంది. కాగా, గత సంవత్సరం జూన్ లో ఔరంగజేబ్ అనే జవాన్ ను కొందరు బలవంతంగా ఎత్తుకెళ్లి, దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News