ys sharmila: వైయస్ షర్మిల వ్యాఖ్యలు బాధాకరం.. తీవ్రంగా ఖండిస్తున్నాం: ఏపీ పోలీసుల అభ్యంతరం

  • షర్మిల వ్యాఖ్యలతో 60వేల మంది పోలీసుల మనోభావాలు గాయపడ్డాయి
  • ఏపీ పోలీసులు బెస్ట్ అనే కితాబులు చాలా వచ్చాయి
  • వైసీపీ అధికారంలోకి వచ్చినా.. కేసులను మేమే విచారించాల్సి ఉంటుంది

సినీ హీరో ప్రభాస్ తో తనకు సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు వైయస్ జగన్ సోదరి షర్మిళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, ఏపీ పోలీసులపై తనకు నమ్మకం లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఏపీ రాష్ట్ర పోలీసు సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, షర్మిళ వ్యాఖ్యలు బాధాకరమని, తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సంఘటన ఏ రాష్ట్ర పరిధిలో జరిగితే, అక్కడే కేసులు నమోదవుతాయని చెప్పారు. రానున్న రోజుల్లో వారి ప్రభుత్వం (వైసీపీ) వచ్చినా... రాష్ట్రంలోని అన్ని కేసులను ఏపీ పోలీసులే విచారించాల్సి ఉంటుందని తెలిపారు. దేశంలోనే ఏపీ పోలీసులు బెస్ట్ అనే కితాబులు తమకు చాలా సార్లు వచ్చాయని అన్నారు. రాష్ట్రంలోని 60వేల మంది పోలీసుల మనోభావాలను షర్మిళ దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News