mohanlal: లుక్ అదిరింది అంటోన్న మోహన్ లాల్ అభిమానులు

  • పరాజయం పాలైన 'ఒడియన్'
  • షూటింగు దశలో 'మరక్కార్'
  • చారిత్రక నేపథ్యంలో సాగే కథ      

ప్రయోగాత్మక చిత్రాలు .. వైవిధ్యభరితమైన పాత్రలను చేయడానికే మోహన్ లాల్ ఆసక్తిని చూపుతుంటారు. అయితే కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ ఇటీవల ఆయన చేసిన 'ఒడియన్' ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా రిజల్ట్ ఆయన అభిమానులను కూడా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో బయటికి వచ్చిన 'మరక్కార్' సినిమాలోని లుక్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

విభిన్నమైన కథా చిత్రాల దర్శకుడిగా ప్రియదర్శన్ కి మంచి పేరు వుంది. ఆయన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మోహన్ లాల్ లుక్ చూస్తుంటే చారిత్రక నేపథ్యంలో ఈ కథ కొనసాగనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తోంది. ఇక ప్రియదర్శన్ కూతురైన కల్యాణి ప్రియదర్శన్ .. మోహన్ లాల్ తనయుడైన ప్రణవ్ మోహన్ లాల్ జంటగా నటిస్తుండటం మరో విశేషం. మోహన్ లాల్ అభిమానులంతా ఈ సినిమాపైనే దృష్టి పెట్టారు. 

More Telugu News