Narendra Modi: దీపావళి సందర్భంగా కేదార్ నాథ్ కు నరేంద్ర మోదీ!

  • 7న స్వామివారిని దర్శించుకోనున్న మోదీ
  • ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రభుత్వాలకు పీఎంఓ ఆదేశాలు 
  • విపరీతమైన మంచుతో భక్తుల ఇబ్బందులు

దీపావళి పర్వదినం సందర్భంగా హిమాలయ పర్వతాల్లోని కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని పీఎంఓ నుంచి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు ఆదేశాలు వెళ్లాయి. రేపు ఆయన కేదారేశ్వరుడిని దర్శించుకోనున్నట్టు తెలుస్తోంది. జోలీ గ్రంట్ ఎయిర్ పోర్టునకు రేపు ఉదయం చేరుకునే మోదీ, అక్కడి నుంచి హెలికాప్టర్ లో కేదార్ నాథ్ కు వెళతారని, కేదార్ పురి పునర్మిర్మాణం పనులను పరిశీలిస్తారని అధికారులు తెలిపారు.

 కాగా, శీతాకాలం ప్రవేశించడంతో, కేదార్ నాథ్ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తోంది. మంచు తీవ్రత అధికంగా ఉండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఆలయాన్ని మూసివేసి, తిరిగి ఆరు నెలల తరువాత తెరుస్తారు. కాగా, గతంలోనూ మోదీ ఓ మారు ప్రధాని హోదాలో కేదారేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News