kuchibhotla srinivas: కూచిభొట్ల శ్రీనివాస్ ను చంపింది నేనే: నేరాన్ని ఒప్పుకున్న నిందితుడు

  • గత ఫిబ్రవరి 24న శ్రీనివాస్ పై కాల్పులు జరిపిన పురింటన్
  • అమెరికాలోని కాన్సస్ నగరంలో ఘటన
  • నిందితుడికి 50 ఏళ్ల కారాగారశిక్ష పడే అవకాశం

అమెరికాలోని కాన్సస్ నగరంలో తెలుగు టెక్కీ కూచిభొట్ల శ్రీనివాస్ ను ఆడం పురింటన్ అనే వ్యక్తి కాల్చి చంపిన విషయం తెలిసిందే. తాజాగా తానే హత్య చేశానంటూ కోర్టులో పురింటన్ నేరాన్ని అంగీకరించాడు.

గత ఏడాది ఫిబ్రవరి 27న ఉద్యోగాన్ని ముగించుకుని తన స్నేహితుడితో కలసి కాన్సస్ లోని ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్ లోకి మద్యం తాగడానికి శ్రీనివాస్ వెళ్లాడు. ఆ సమయంలో విదేశీయులపై విద్వేషం పెంచుకున్న పురింటన్... వీరిద్దరిపై కాల్పులు జరిపాడు. అంతేకాదు, తన దేశం నుంచి విదేశీయులు వెళ్లిపోవాలంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు.

మరోవైపు, మే 4వ తేదీన పురింటన్ కు శిక్ష ఖరారు కానుంది. అతనికి పెరోల్ లేకుండా 50 ఏళ్ల వరకు యావజ్జీవ కారాగారశిక్ష పడే అవకాశం ఉంది. నిందితుడు నేరాన్ని అంగీకరించిన నేపథ్యంలో, శ్రీనివాస్ భార్య సునయన స్పందించారు. విద్వేషం ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదనే బలమైన సందేశాన్ని అందరూ అందించాలని, అందరూ పరస్పరం ప్రేమించుకోవాలే కాని ద్వేషించుకోరాదని ఆమె అన్నారు.

More Telugu News