Tripura: 20 ఏళ్లు సీఎం పదవిలో ఉన్న పేద వ్యక్తి... ఇక అధికారానికి దూరం!

  • త్రిపురలో ఓటమిని చవిచూసిన మాణిక్ సర్కార్
  • నరేంద్ర మోదీ హవాతో ప్రాభవాన్ని కోల్పోయిన సీపీఎం
  • నేడు పదవికి రాజీనామా చేయనున్న మాణిక్

మాణిక్ సర్కార్... అధికారంలో ఉంటే డబ్బు సంపాదనే పరమావధిగా పనిచేసే ముఖ్యమంత్రులు ఎందరో ఉన్న ఈ రోజుల్లో 20 సంవత్సరాల పాటు త్రిపుర సీఎంగా పనిచేసి కూడా అత్యంత పేద ముఖ్యమంత్రిగా నిలిచి చరిత్ర సృష్టించిన వ్యక్తి. 1998లో సీఎం పదవిని చేపట్టి, వరుసగా నాలుగు సార్లు తన పార్టీని విజయపథంలో నిలిపి, పశ్చిమ బెంగాల్ లో జ్యోతి బసు తరువాత అత్యధిక కాలం పాటు సీఎంగా కొనసాగిన రికార్డును సొంతం చేసుకున్న ఆయన, ఇప్పుడు గద్దెదిగారు. త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించడంతో తన పదవికి మాణిక్ సర్కార్ నేడు రాజీనామా చేయనున్నారు.

ఇప్పటికీ సొంత ఇల్లు లేని ఆయన, ముత్తాతకు చెందిన అతి చిన్న ఇంట్లో ఉంటూ, తనకు వచ్చే జీతాన్ని సీపీఎం పార్టీకి ఇస్తూ, పార్టీ ఇచ్చే రూ. 5 వేలు, తన భార్యకు వచ్చే పెన్షన్ తో నెట్టుకొస్తున్నారు. ప్రతి రోజూ ఓ చార్మినార్ సిగరెట్ ప్యాకెట్, కాస్తంత నస్యం ఉంటే తనకు పూట గడిచిపోతుందని చెప్పే మాణిక్ సర్కార్, రాష్ట్రంలో నిరుద్యోగం పెరగడం, అభివృద్ధి లేమితో ప్రజల్లో పెరిగిన అసహనం, కొనసాగుతున్న నరేంద్ర మోదీ హవా తదితర కారణాలతో అధికారానికి దూరమయ్యారు.

More Telugu News