Allu Arjun: 'నా పేరు సూర్య' చెప్పిన రోజునే వస్తాడట!

  • అల్లు అర్జున్ హీరోగా ' నా పేరు సూర్య'
  • ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తి 
  • ఏప్రిల్ 13న రిలీజ్ అంటూ ప్రచారం 
  • అదేం లేదంటూ స్పష్టం చేసిన టీమ్

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. అనూ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టు ఆ మధ్య ప్రకటించారు. ఇక మహేశ్ - కొరటాల శివ కాంబినేషన్లోని 'భరత్ అనే నేను' సినిమాను కూడా ఏప్రిల్ 27వ తేదీనే విడుదల చేయనున్నారు.

అయితే అదే రోజున ' నా పేరు సూర్య'ను రిలీజ్ చేయడం వలన, థియేటర్ల సమస్య వస్తుందనీ, వసూళ్లపై కూడా ప్రభావం చూపుతుందని ఈ సినిమా టీమ్ భావించినట్టుగా టాక్. ఈ కారణంగా ఈ సినిమాను కాస్త ముందుగా .. అంటే, ఏప్రిల్ 13వ తేదీన రిలీజ్ చేయనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే అందులో వాస్తవం లేదనీ, ముందుగా చెప్పినట్టుగానే తమ సినిమా ఏప్రిల్ 27నే వస్తుందని తాజాగా ఈ సినిమా టీమ్ స్పష్టం చేసింది.

More Telugu News