nani: 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' 4 రోజుల్లో రాబట్టిన మొత్తం

  • తొలి రోజున 7 కోట్లకి పైగా షేర్ 
  • రెండో రోజుకి 10 కోట్లకి పైగా వసూళ్లు
  • 4 రోజుల్లో ఒక్క నైజామ్ లోనే 7.51 కోట్లు  

నాని సినిమా అంటే నష్టాలు వచ్చే అవకాశం చాలా తక్కువ. వస్తే భారీ లాభాలు .. లేదంటే స్వల్ప లాభాలు అనే నమ్మకం నిర్మాతల్లోను .. బయ్యర్లలోను ఏర్పడింది. అందువలన ఆయన సినిమాలకు మంచి మార్కెట్ వుంది. నాని ఎంపిక చేసుకునే కథలు .. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆయన చేరువైన విధానమే అందుకు కారణం.

ఆయన తాజా చిత్రంగా 'మిడిల్ క్లాస్ అబ్బాయ్' కూడా అదే తరహాలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా 7 కోట్లకి పైగా షేర్ ను వసూలు చేసింది. రెండవ రోజున 10 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ఇక నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 22.27 కోట్లను రాబట్టింది. ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా ఈ 4 రోజుల్లో 7.51 కోట్లను సాధించడం విశేషం. సహజత్వంతో కూడిన నటనను ఆవిష్కరించడంలో,  నాని .. సాయిపల్లవి .. భూమిక ముగ్గురూ ముగ్గురే కావడం ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ ను తీసుకొస్తోంది.  

More Telugu News