: ఆ స్తోమత ‘బ్లూ క్రాస్’ కు లేదు: అక్కినేని అమల

ప్రభుత్వం వద్ద రూపాయి తీసుకోకుండా సేవ చేస్తున్నామని, జీహెచ్ఎంసీ పరిధిలోని వీధికుక్కలు అన్నింటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసే స్తోమత బ్లూ క్రాస్ కు లేదని జంతు సంరక్షణ కార్యకర్త, ప్రముఖ నటి అక్కినేని అమల అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో బ్లూక్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన యానిమల్ బర్త్ కంట్రోల్  కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా అమల మాట్లాడుతూ, మియాపూర్ లోని 108 వ వార్డులో ప్రయోగాత్మకంగా మూడు వేల కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను బ్లూక్రాస్ చేయనున్నట్టు చెప్పారు. కేవలం, నార్త్, వెస్ట్ జోన్ లోనే రెండు లక్షల కుక్కలు ఉన్నట్లు బ్లూ క్రాస్ గుర్తించిందని అమల పేర్కొన్నారు. వీధి కుక్కల సమస్య తలకాయనొప్పిగా మారకముందే ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. వీధి కుక్కలకు ప్రత్యేక పార్క్ ను నెక్లెస్ రోడ్డులో త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు అమల చెప్పారు.

More Telugu News