: సుప్రీంకోర్టు ఇచ్చిన ట్రిపుల్ తలాక్ రద్దు తీర్పుపై స్పందించిన అసదుద్దీన్ ఒవైసీ

ముస్లింలు ట్రిపుల్ త‌లాక్ అంటూ భార్య‌కు విడాకులు ఇచ్చే ప‌ద్ధ‌తి చెల్ల‌దని తీర్పునిచ్చిన‌ సుప్రీంకోర్టు, త‌మ తీర్పు  ఆరు నెలల పాటు అమలయ్యేలా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చి, ఇందు కోసం కేంద్ర‌ ప్ర‌భుత్వం చ‌ట్టం చేయాల‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. దీనిపై స్పందించిన ఏఐఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ... సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మ‌నం గౌర‌వించాల్సి ఉంద‌ని చెప్పారు. కానీ, దీన్ని అమ‌లు చేయ‌డం ఎంతో క‌ష్టత‌రమ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. కాగా, సుప్రీంకోర్టు తీర్పుపై బీజేపీ నేతలు స్పందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

More Telugu News