mahesh babu: అరబిక్ భాషలోను అదే రోజున 'స్పైడర్'

మహేశ్ బాబు అభిమానులంతా 'స్పైడర్' మూవీ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించిన ఈ సినిమాను మలయాళ, హిందీ భాషల్లోకి డబ్ చేయనున్నారు. అలాగే అరబిక్ భాషలోను డబ్ చేసి, అదే రోజున విడుదల చేయనున్నట్టు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మురుగదాస్ చెప్పాడు.

ఈ సినిమాలోని "పుచ్చకాయ .. పుచ్చకాయ .." అనే ఒక పాట కూడా అరబిక్ స్టైల్లోనే ఉంటుందట. త్వరలోనే ఆ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. అలాగే వచ్చేనెల 9వ తేదీన చెన్నైలో జరగనున్న ఈవెంట్ లో థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.      

More Telugu News