nithin: దిల్ రాజుకి రెండు సినిమాల వల్ల కోట్లలో లాస్?

హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ చేసిన 'లై' సినిమా, ఈ నెల 11వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'నేనే రాజు నేనే మంత్రి', ' జయ జానకి నాయక' సినిమాలతో ఈ సినిమా పోటీ పడింది. అయితే ఈ సినిమా సాధారణమైన ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదనే విమర్శలను మూటగట్టుకుంది. దాంతో వసూళ్లపరంగా వెనుకబడింది.

ఈ సినిమా నైజామ్ హక్కులను 8 కోట్లకి పైగా ఖర్చు పెట్టి దిల్ రాజు తీసుకున్నారు. అయితే ఆయనకి 3 కోట్లకి పైగా షేర్ మాత్రమే వచ్చిందట. దాంతో 5 కోట్లు లాస్ అయ్యాడని అంటున్నారు. ఇక 'జయ జానకి నాయక' సినిమా ఏరియా హక్కులను కూడా ఆయనే తీసుకున్నారు. ఈ సినిమా ద్వారా కూడా ఆయనకి 2 కోట్ల వరకూ రికవరీ కావలసి ఉందట. ఈ సినిమా విషయంలోను ఎంతోకొంత నష్టం తప్పకపోవచ్చని చెప్పుకుంటున్నారు.      

More Telugu News