: జానెడు పొట్ట కోసం తిప్పలు... పదేళ్ల ఈ ప్రత్యక్ష నరకం నుంచి తప్పించండని వేడుకున్న కంబోడియా యువతి!

జానెడు పొట్ట కోసం పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. కుటుంబం మొత్తం కడుపునిండా పట్టెడన్నం తినేందుకు ఉపాధి నిమిత్తం సౌదీ చేరిన కాంబోడియా యువతి ప్రత్యక్ష నరకం నుంచి కాపాడాలని వేడుకుంటోంది. సనా అనే కంబోడియా యువతి 12 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా వచ్చి, పనిమనిషిగా చేరింది. రెండేళ్లు ఆమెకు అంతా హాయిగా సాగిపోయింది. రెండేళ్ల తరువాత ఆమె వీసా, పాస్ పోర్ట్, సెల్ ఫోన్ ను లాగేసుకున్నారు. జీతం ఇచ్చేవారుకాదు. ఒక్క పూటే తిండి పెట్టేవారు. ఆమెను బయటకు వెళ్లనిచ్చేవాళ్లు కాదు. పని అయిపోగానే ఆమె కాలికి గొలుసులు కట్టి బంధించేవారు.

శారీరకంగా, మానసికంగా వేధించి, శృంగారావసరాలను తీర్చుకునేవారు. ఇలా పదేళ్ల పాటు ఆమెకు నరకం చూపించారు. ఈ మధ్యే వేరే పనిమనిషిని పెట్టుకున్నారు. తన గోడును వెల్లడిస్తూ తన దగ్గరున్న సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరించి, ఆమె ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. తన కుటుంబ సభ్యులు కూడా తాను చనిపోయానని భావించి ఉంటారని తెలిపింది. ఇది వైరల్ అయి కాంబోడియా ఎంబసీకి చేరింది. దీంతో ఆ వీడియోలో ఆమె చెప్పిన అడ్రస్ కు వెళ్లి చూడగా, గొలుసులతో కట్టేసి ఉన్న ఆమెను చూసి చలించిపోయారు. తక్షణం ఆమెను విడిపించి, ఆసుపత్రికి తరలించారు. సౌదీలో ఆమె యజమానిపై కేసు నమోదు చేసి, ఇన్నేళ్ల ఆమె శ్రమకు ప్రతిఫలం ఇప్పిస్తామని అధికారులు తెలిపారు. 

More Telugu News