: తెరచుకోని పీఎస్యూ బ్యాంకులు... సమ్మెలో 10 లక్షల మంది, సేవలకు విఘాతం!

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వద్దని, తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ, 10 లక్షల మంది ప్రభుత్వ రంగ బ్యాంకు, పాతతరం ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులు సమ్మెలోకి దిగడంతో, ఈ ఉదయం బ్యాంకులు తెరచుకోలేదు. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తూ, వాటిని నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగానే ఈ బంద్ ను తలపెట్టినట్టు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5 వేలకు పైగా వివిధ బ్యాంకుల శాఖలు మూతపడగా, దాదాపు 80 వేల మంది సమ్మెలో పాల్గొంటున్నారు. కార్పొరేట్ కంపెనీల నుంచి వసూలు చేయాల్సిన బకాయిలను పక్కనబెట్టి, సుమారు రూ. 2.5 లక్షల కోట్ల బకాయిలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడాన్ని కూడా ఉద్యోగ సంఘాలు తప్పుబడుతున్నాయి. బ్యాంకులను విలీనం చేయడం ద్వారా ఉద్యోగులను బలవంతంగా తొలగించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేంద్రం చర్యలను తాము అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా, ఈ సమ్మెతో కస్టమర్ సేవలతో పాటు చెక్ క్లియరెన్స్ సేవలు కూడా నిలిచిపోయాయి.

More Telugu News