charan: చరణ్ సరసన సైఫ్ అలీ ఖాన్ కూతురు?

ప్రస్తుతం చరణ్ .. సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం 1985' సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు తరువాత ఆయన కొరటాలతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆ తరువాత సినిమా మణిరత్నం దర్శకత్వంలో వుండనున్నట్టు తెలుస్తోంది. తమ కాంబినేషన్లో తప్పకుండా ఒక సినిమా ఉంటుందని ఇటీవల మణిరత్నం చెప్పిన సంగతి తెలిసిందే.

 ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీలోను తెరకెక్కించే ఆలోచనలో మణిరత్నం ఉన్నారట. అందువలన ఆయన ఈ సినిమాతో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ ను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. సారా అలీ ఖాన్ ను ఒప్పిస్తే బాలీవుడ్లోను ఈ సినిమాకి భారీ మార్కెట్ ఉంటుందని భావిస్తున్నట్టు సమాచారం. ఆ దిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. మరి సారా అలీ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా .. లేదా అనేది చూడాలి. 

More Telugu News