: బహ్రెయిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో క‌ల‌క‌లం.. కుప్ప‌కూలిన‌ యూఎస్‌ మిలటరీ ఎయిర్‌ క్రాఫ్ట్‌

బహ్రెయిన్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో ఈ రోజు సాయంత్రం ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఆ ఎయిర్‌పోర్టులో యూఎస్‌ మిలటరీ ఎయిర్‌ క్రాఫ్ట్ దిగుతుండ‌గా ఒక్క‌సారిగా కుప్ప‌ కూలిపోయింది. ఈ ప్ర‌మాదంలో ప్రాణ, ఆస్తి నష్టంపై సంబంధిత అధికారులు ఎటువంటి వివ‌రాలు చెప్ప‌డం లేదు. పర్షియన్‌ సింధుశాఖలో సౌదీ అరేబియా పొరుగున బ‌హ్రెయిన్‌ దేశం ఉంటుంది. ఇది ఒక దీవి. ఈ ప్రాంతంలో అమెరికా నావికా దళ స్థావరం ఉంది. అమెరికా అధికారులు కూడా ఈ అంశంపై పెద‌వి విప్ప‌డం లేదు. ఈ ప్ర‌మాదానికి సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. 

More Telugu News