rana: రానా ఫెర్ఫార్మెన్స్ మెయిన్ హైలైట్ అట!

రానా కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో చేసిన 'నేనే రాజు నేనే మంత్రి' .. ఈ రోజున విడుదలైంది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు 'జోగేంద్ర' గా రానా అద్భుతంగా నటించాడని అంటున్నారు. ఒక వైపున రాజకీయ వ్యూహాలు .. మరో వైపున కథానాయికతో రొమాంటిక్ వ్యవహారాలలో రానా చూపిన నటన సూపర్ అనేస్తున్నారు.

 రానా పాత్రను తీర్చిదిద్దిన తీరు .. ఆ పాత్రలో ఆయన పలికించిన హావభావాలు అదుర్స్ అని చెబుతున్నారు. రానా నటన ఈ సినిమాకి మెయిన్ హైలైట్ గా నిలిచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రానా .. కాజల్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనే టాక్ వినిపిస్తోంది. తేజ టేకింగ్ .. బ్యాగ్రౌండ్ స్కోర్ .. యాక్షన్ ఎపిసోడ్స్ .. చిత్రీకరణ ..  డైలాగ్స్ ఈ సినిమా స్థాయిని పెంచాయని అంటున్నారు. నటుడిగా రానా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడంటూ ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తున్నారు.    

More Telugu News