: భూమిలాంటి రెండు ఉపగ్రహాలను గుర్తించిన శాస్త్రవేత్తలు!

మన భూమిని పోలిన రెండు కొత్త గ్రహాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మన సూర్యుడిలాంటి ఒక నక్షత్రానికి సమీపంలో ఉన్న ఈ రెండు గ్రహాలూ మానవ ఆవాసానికి అనువుగా ఉంటాయని వారు తెలిపారు. ఈ రెండు గ్రహాలు ఇంచుమించు భూమి పరిమాణంలోనే ఉన్నాయని వారు చెబుతున్నారు. భూమి కంటే ఈ రెండు గ్రహాలు కేవలం 1.7 రెట్లు మాత్రమే పెద్దగా ఉన్నాయని చెప్పారు. ‘టౌ సెటీ’ అనే నక్షత్ర పరిధిలో ఈ రెండూ తిరుగుతున్నాయని వారు తెలిపారు. ఈ ‘టౌ సెటీ’ చుట్టూ భారీ స్థాయిలో శిథిలాలు ఉన్నాయని, దీంతో ఆస్ట్రాయిడ్ ల బారిన పడే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నారు. 

More Telugu News