: హైదరాబాదులో వెలుగు చూసిన భారీ హవాలా రాకెట్... ఏటా తరలుతున్న రూ. 1000 కోట్లు!

హైదరాబాదులో భారీ హవాలా రాకెట్ వెలుగు చూసింది. చందానగర్ హెచ్డీఎఫ్సీ బ్యాంకు మేనేజర్ ఫిర్యాదుతో విచారణ ప్రారంభించిన పోలీసులు, ఈడీ అధికారులు మతిపోయే వివరాలు తెలుసుకున్నారు. ఏటా 1000 కోట్ల రూపాయలు విదేశాలకు హవాలా రూపంలో తరలిపోతున్నాయని పోలీసులు గుర్తించారు. మహేష్ ఖత్రీ అనే వ్యాపారి 31 కోట్ల రూపాయలు విదేశాలకు తరలించినట్టు గుర్తించారు. స్నేహితులు, ఇతరుల పేరుతో నకిలీ పత్రాలు తయారు చేసి, వాటి ద్వారా విదేశాలకు ఆయన డబ్బులు తరలిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు సుమారు 150 కోట్ల రూపాయలు తరలించినట్టు గుర్తించారు.

ఈ మొత్తాన్ని హవాలా రూపంలో విదేశాలకు తరలించి, అక్కడ పరిశ్రమ స్థాపిస్తున్నట్టు భోగస్ పత్రాలు రూపొందించి, ఆ ఖాతాల్లో విదేశాలకు తరలించిన డబ్బు పెట్టుబడుల రూపంలో తిరిగి స్వదేశం రప్పిస్తున్నారు. ఈ క్రమంలో భారత్ నుంచి విదేశాలకు బ్లాక్ మనీ రూపంలో వెళ్లిన డబ్బు తిరిగి భారత్ కు వైట్ మనీగా వస్తుందని గుర్తించారు. ఈ దందాలో ఖత్రీకి స్టీల్ వ్యాపారి వినోద్ ఓఝా సహకరించాడు. చెక్కులు తీసుకుని నగదును ఆనంద్ కుమార్ అనే హవాలా వ్యాపారి సమకూర్చేవాడని ఈడీ అధికారులు తెలిపారు. 

More Telugu News