: 'నేనే రాజు నేనే మంత్రి'తో ప్రారంభం కావాల్సిన 'సురేశ్ మహల్' దగ్ధం!

ప్రకాశం జిల్లా చీరాలలోని ప్రముఖ థియేటర్ లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ పట్టణంలో ఇప్పటికీ టూరింగ్ టాకీసులే ఉన్నాయి. దీంతో చర్చ్ రోడ్ లోని తమ ధియేటర్ 'సురేశ్ మహల్'ను సరికొత్త హంగులతో ప్రముఖ సినీ నిర్మాత డాక్టర్‌ దగ్గుబాటి రామానాయుడు కుటుంబం తీర్చిదిద్దింది. ఈ థియేటర్ ఎన్నో ఏళ్లుగా చీరాల వాసులకు వినోదాన్ని పంచుతోంది. అయితే ఆధునిక సౌకర్యాలు పెరిగినా చీరాల థియేటర్లకు మాత్రం మోక్షం రాలేదు.

తాజాగా రానా నటించిన 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా విడుదల సమయానికి ఏసీ, డిజిటల్ సౌండ్ ఇతర హంగులతో సురేశ్ మహల్ ను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో నేడు రానా ఈ థియేటర్ ను మరోసారి ఓపెనింగ్ చేయాల్సి ఉంది. ఇంతలో నిన్న ఉదయం మరమ్మతు పనులు చేస్తున్న సమయంలో ఏసీ నుంచి మంటలు చెలరేగాయి. ఇవి థియేటర్‌ మొత్తం వ్యాపించాయి. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఒక కార్మికుడికి గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. సుమారు కోటి రూపాయల ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

More Telugu News