: ఖాతాదారులకు షాకిస్తున్న బ్యాంకులు.. ఎస్‌బీఐ బాటలో ప్రైవేటు బ్యాంకులు!

ఖాతాదారులకు బ్యాంకులు షాకిస్తున్నాయి. పొదుపు ఖాతాలపై వడ్డీరేట్లను తగ్గించుకుంటూ పోతున్నాయి. గత నెల 31న ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు తొలుత పొదుపు ఖాతా వడ్డీ రేట్లను తగ్గించగా తాజాగా ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా అదే బాటలో నడుస్తున్నాయి.

రూ.50 లక్షల లోపు డిపాజిట్లపై 50 బేస్ పాయింట్ల కోత విధిస్తూ 3.50 శాతం వార్షిక వడ్డీని అందించనున్నట్టు యాక్సిస్ బ్యాంకు తెలిపింది. రూ.50 లక్షలు, ఆ పైన మొత్తాలు కలిగిన డిపాజిట్లకు మాత్రం 4 శాతం వడ్డీ కొనసాగుతుందని వివరించింది. కాగా, రూ.కోటి కంటే తక్కువ డిపాజిట్ కలిగిన ఖాతాలకు 3.5 శాతం, ఆ పైన డిపాజిట్లకు 4 శాతం వార్షిక వడ్డీ అందించనున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. ఎస్‌బీఐ ప్రకటన 90 శాతం మంది ఖాతాదారులపై ప్రభావం చూపనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఎస్‌బీఐని అనుసరిస్తూ రూ.50 లక్షల లోపు డిపాజిట్లపై వడ్డీ రేటును 3.5 శాతానికి తగ్గించింది.

More Telugu News