: డ్రగ్స్ వ్యవహారంలో గట్టిగా వ్యవహరించమని ఆదేశించా!: సీఎం కేసీఆర్

డ్రగ్స్  వినియోగానికి సంబంధించి ఎన్సీబీ నివేదికలో తెలంగాణ కింది స్థాయిలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, డ్రగ్స్ ను మొగ్గ దశలోనే తుంచి వేయాలని , ఈ వ్యవహారంలో కేబినెట్ మంత్రులున్నా ఉపేక్షించ వద్దని గట్టిగా ఆదేశించానని చెప్పారు. తెలంగాణలో గుడుంబా, పేకాట, గ్యాంబ్లింగ్ కు స్థానం లేదని అన్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇస్తామని, పనికి సమానవేతనం ఇస్తామని, శ్రమ దోపిడీకి గురికానివ్వమని అన్నారు. నేరెళ్ల ఘటనకు దళిత రంగు పులమడం సబబు కాదని అన్నారు. రాజీవ్ రహదారిని విస్తరించి పీవీ హై వే స్థాయిలో నిర్మించాలని ఆదేశించారు.

More Telugu News