kangana: 'మణికర్ణిక'గా యుద్ధ రంగంలోకి దిగుతోన్న కంగనా రనౌత్!

'రాణి ఝాన్సీ లక్ష్మీబాయి' జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు క్రిష్ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి 'మణికర్ణిక' అనే టైటిల్ ను ఫిక్స్ చేసుకున్నారు. కంగనా రనౌత్ ప్రధానమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో వుంది. ఇప్పటికే కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసిన క్రిష్, తాజా షెడ్యూల్ ను హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశాడు.

 ప్రతి నాయకుడికి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ఆయన తెరకెక్కిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ లో కంగనా రనౌత్ పాల్గొననుంది. 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఆమె కాంబినేషన్లోని యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. హిందీతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 'శాతకర్ణి' తరువాత క్రిష్ చేస్తోన్న ఈ చారిత్రక చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి.  

More Telugu News