sai srinivas: ఐటమ్ సాంగ్ తో కేథరిన్ దుమ్ము దులిపేస్తోంది!

అందానికి .. ఆకర్షణకి కేరాఫ్ అడ్రెస్ గా కేథరిన్ పేరు చెప్పుకోవచ్చు. తెలుగులో క్రేజ్ పరంగా ఆమె ఒక్కో మెట్టూ ఎక్కుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె 'జయ జానకి నాయక' సినిమా చేసింది. ఈ సినిమాలో ఆమె చేసిన ఐటంసాంగ్ వీడియో టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ వీడియో టీజర్ కి యూత్ నుంచి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది.

 "ఏ ఫర్ యాపిలూ .." అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్ లో సూపర్ హాట్ లుక్ తో కేథరిన్ రెచ్చిపోయింది. హాట్ అండ్ సెక్సీ అందాలతో ఆమె వేసిన స్టెప్స్ కి కుర్రకారు ఫిదా అవుతున్నారు. మాస్ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడానికి ఈ ఒక్క సాంగ్ చాలు అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తన బీట్ తో కుర్రకారులో మరోమారు ఉత్సాహాన్ని రేకెత్తించాడనే చెప్పాలి. ఈ సినిమా ఆడియోలో ఈ సాంగ్ కి ప్రత్యేకమైన స్థానం లభించడం ఖాయమనిపిస్తోంది.

     

More Telugu News