Anu: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

*  ప్రస్తుతం విశాల్ హీరోగా మిష్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'తుప్పరి వాలన్' చిత్రంలో కథానాయిక అనూ ఇమ్మానుయేల్ పిక్ పాకెట్ (జేబుదొంగ)గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆ పాత్ర కోసం జేబులు ఎలా కొట్టేయాలన్న విషయంలో కొన్ని టెక్నిక్స్ నేర్చుకున్నానని, దాంతో షూటింగులో చాలా ఈజీ అయిందని ఈ చిన్నది నవ్వుతూ చెప్పింది.      
*  రాజ్ తరుణ్ హీరోగా సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో గతంలో వచ్చిన 'కుమారి 21 ఎఫ్' చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి విదితమే. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్లో దర్శకుడు సుకుమార్ మరో చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీనికి కూడా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తాడు.
*  నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న 'లై' చిత్రం ట్రైలర్ ను వచ్చే నెల మొదటి వారంలో రిలీజ్ చేస్తారు. అలాగే, చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటించింది.
*  'పెళ్లి చూపులు' ఫేం విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 25న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.  

More Telugu News