: ఐటీ పునాదులు కదులుతాయా?.. డ్రగ్స్ లిస్టులో 1500 మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు!

డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటి వరకు విచారణ మొత్తం సినీ పరిశ్రమ చుట్టే తిరిగింది. ఇంకా కొంత మంది సినీ ప్రముఖులను విచారించాల్సి ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి సెకండ్ లిస్ట్ కూడా సిట్ అధికారుల వద్ద ఉందనే సమాచారం కూడా వెలువడుతోంది. ఇదే సమయంలో డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ తో పాటు కొంత మంది ఇతరులను కూడా సిట్ అధికారులు విచారించారు.

తాజాగా ఓ విషయం సంచలనం రేకెత్తిస్తోంది. ఐటీకి కేరాఫ్ అడ్రస్ అయిన హైదరాబాదులో...  సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు డ్రగ్స్ మత్తులో జోగుతున్నారనేదే ఆ వార్త. ఎంతో మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కెల్విన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడట. డ్రగ్స్ వినియోగిస్తున్న వారిలో ఐటీ ఉద్యోగులే కాక, ఐటీ కంపెనీల సీఈవోలు కూడా ఉన్నారనే సమాచారం ప్రకంపనలు సృష్టిస్తోంది. అంతేకాదు, నెదర్లాండ్స్ కు చెందిన అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ మైక్ కమింగ లిస్ట్ లో కూడా వందలాది మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల పేర్లు ఉన్నాయట. మొత్తం మీద 1500 మంది ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టు సమాచారం. ఇప్పటికే పలువురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లపై ఎక్సైజ్ సిట్ నిఘా పెట్టింది. త్వరలోనే వీరి విచారణ కూడా ప్రారంభం కానుంది. ఇదే జరిగితే, ఐటీ పునాదులు కదలడం ఖాయం అని చెబుతున్నారు.

More Telugu News