harish: 'వైశాఖం' రెస్పాన్స్ పట్ల దర్శక నిర్మాతల ఆనందం!

దర్శకురాలు జయ. బి పేరు వినగానే వెంటనే 'చంటిగాడు' .. 'లవ్ లీ' సినిమాలు గుర్తుకు వస్తాయి. పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రాలుగా తెరకెక్కిన ఆ సినిమాలు యూత్ ను ఎంతగానో ఆకట్టుకుని విజయాలను అందుకున్నాయి. అలాంటి జయ.బి తన తదుపరి చిత్రంగా 'వైశాఖం'ను నిన్ననే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. బి.ఎ.రాజు నిర్మించిన ఈ సినిమా ద్వారా, హరీశ్ .. అవంతిక హీరో హీరోయిన్లు గా పరిచయమయ్యారు.

విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో, ఈ రోజున హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ .. కథపై నమ్మకంతో ఈ సినిమాను తెరకెక్కించామనీ .. తాము అనుకున్నట్టుగానే యూత్ కి బాగా కనెక్ట్ అయిందని అన్నారు. హరీశ్ .. అవంతిక కొత్త వాళ్లైనా మంచి ప్రతిభను కనబరిచారని చెప్పారు. టీమ్ సహకారంతోనే ఈ సక్సెస్ ను సాధించామంటూ .. ఆదరిస్తోన్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. 

More Telugu News