: ఖ‌ర్చు త‌గ్గించ‌డానికి జీతంలో కోత‌... జెట్ ఎయిర్‌వేస్ నిర్ణయం

వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఆగ‌స్టు 1 నుంచి జూనియ‌ర్ పైల‌ట్ల జీతంలో ముప్పై శాతం వ‌ర‌కు కోత విధించనున్న‌ట్లు జెట్ ఎయిర్‌వేస్ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ప్ర‌తి నెలా ప‌ది రోజుల జీతాన్ని త‌గ్గించుకోవాల్సిందిగా కోరుతూ శిక్ష‌ణలో ఉన్న పైల‌ట్ల‌ను లేఖ ద్వారా కోరింది. ఈ నిర్ణ‌యం ప్ర‌భావం దాదాపు 200 మంది జూనియ‌ర్ పైలట్ల మీద ప‌డ‌నుండ‌టంతో జెట్ ఎయిర్‌వేస్ పైల‌ట్ల సంఘం - ద నేష‌న‌ల్ ఏవియేట‌ర్స్ గిల్డ్ యాజ‌మాన్యంతో చ‌ర్చించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం జూనియ‌ర్ పైల‌ట్ల‌కు నెల‌కు రూ. 2 ల‌క్ష‌ల‌కు జీతంగా అంద‌జేస్తున్న‌ట్లు స‌మాచారం.

More Telugu News