: బ్రిట్నీ స్పియర్స్ చావు తెలివితేటలు... డ్రగ్స్ లో దొరక్కుండా ఉండేందుకు గుండు!

ప్రస్తుతం భర్తతో విడిపోయి, పిల్లల సంరక్షణ తనకు అప్పగించాలని కోర్టులో వేడుకుంటున్న అమెరికన్ పాప్ గాయని బ్రిట్నీ స్పియర్స్ తన తెలివితేటలను ప్రదర్శించింది. గతంలో యాంఫిటమైన్ డ్రగ్స్ వాడిన ఆమె, ఆ విషయం విచారణలో తేలకుండా ఉండేందుకు గుండు కొట్టించుకుంది. డ్రగ్స్ తీసుకుంటే, దాని అవశేషాలు రక్తంలో నాలుగు రోజులు మాత్రమే ఉంటాయి. లాలాజలంలో మూడు రోజుల వరకూ ఉండే యాంఫిటమైన్ అవశేషాలు, కురులలో అయితే, మూడు నెలల వరకూ ఉంటాయి.

ఈ విషయాన్ని తెలుసుకున్న ఆమె, గుండు కొట్టించుకుంది. మత్తుమందుల అవశేషాలు కురులలో లభిస్తే, తన పిల్లల సంరక్షణ మాజీ భర్త కెవిన్ ఫెడర్లైన్ కు అప్పగిస్తారన్న భయంతోనే ఆమె ఈ పని చేసినట్టు తెలుస్తోంది. కాగా, హెరాయిన్, మరిజువానా, కొకైన్ తదితర మాదకద్రవ్యాలు వాడితే, దాని అవశేషాలు 90 రోజుల వరకూ వెంట్రుకల్లో ఉంటాయి.

More Telugu News