akhil: అఖిల్ తోనే నెక్స్ట్ మూవీ ప్లాన్ చేస్తోన్న బోయపాటి?

బోయపాటి తాజా చిత్రంగా రూపొందిన 'జయ జానకి నాయక' చిత్రం .. విడుదలకి ముస్తాబవుతోంది. ఈ సినిమా తరువాత బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్టు ఎవరితో వుండనుందనే ఆసక్తి అందరిలోనూ వుంది.  ఈ నేపథ్యంలో బాలకృష్ణతో చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇద్దరి మధ్యా చర్చలు జరిగినట్టుగా కూడా చెప్పుకుంటున్నారు.

అయితే అఖిల్ తోను బోయపాటి చేసే ఛాన్స్ ఉందనేది తాజా సమాచారం. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ ఓ రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమా తరువాత ప్రాజెక్టును అఖిల్ ఎవరితోను కమిట్ కాలేదు. అందువలన బోయపాటితో ఫిక్స్ కావొచ్చని చెప్పుకుంటున్నారు. బాలయ్యతో మూవీ కంటే ముందే బోయపాటి ఈ సినిమా చేస్తాడేమో చూడాలి మరి.   

More Telugu News