: కేరళలో మందుల కొరత.. ప్రాణాలు తీస్తున్న ‘డెంగ్యూ’!

సముద్ర తీరం, రివర్ బోట్స్, పచ్చటి కొబ్బరి చెట్లు, టీ తోటలతో  కళకళలాడే పర్యాటక ప్రాంతం కేరళ. నిత్యం ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య బాగానే ఉంటుంది. అయితే, ఈ ప్రాంతాన్ని ఇప్పుడు డెంగ్యూ వ్యాధి భయపెడుతోంది. దోమ కారణంగా వ్యాప్తి చెందే వైరస్ డెంగ్యూ. ఈ వ్యాధి లక్షణాలు 'ఫ్లూ’ లక్షణాలనే పోలి ఉంటాయి. తీవ్రమైన జ్వరం వచ్చి మంచం పాలవుతారు. ఈ ఏడాది మే నుంచి చూస్తే ఈ రాష్ట్రంలో పదకొండు వేల మంది డెంగ్యూ వ్యాధి బారిన పడ్డారు. గత మూడు వారాలుగా చూస్తే సుమారు 21 మంది డెంగ్యూ కారణంగా మృతి చెందినట్టు ఓ ప్రభుత్వాధికారి చెప్పారు.

కేరళ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ ఆర్ ఎల్ సరితా మాట్లాడుతూ, మందులు, హెల్త్ వర్కర్స్ కొరత నెలకొందని, ప్రస్తుత పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు నిపుణులైన వైద్యుల కొరత కూడా ఉందని అన్నారు. పాఠశాలల్లో, ఆలయాల్లో ఎమర్జెన్సీ మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని చెప్పారు. డెంగ్యూ బాధితులు వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రి వరండాల్లో పడిగాపులు కాస్తున్న దుస్థితి నెలకొందని తిరువనంతపురంలోని ఆసుపత్రికి చెందిన ఓ వైద్యుడు చెప్పారు.

More Telugu News