nani: 'మిడిల్ క్లాస్ అబ్బాయి' కూడా ఈ ఏడాదే వస్తాడట!

ఒకటి కాదు .. రెండు కాదు .. మూడు కాదు .. ఏకంగా ఏడు హిట్లు కొట్టిన అరుదైన ఘనతను నాని సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా వచ్చిన 'నిన్ను కోరి' ఆయనకి ఈ రికార్డును అందించింది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే నాని తదుపరి సినిమాను పూర్తి చేసే పనిలో వున్నాడు.

 ఆయన తదుపరి సినిమాగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి' తెరకెక్కుతోంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతభాగం షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాను కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చారట. డిసెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేయవచ్చని అంటున్నారు. ఈ ఏడాది 'నేను లోకల్' .. ' నిన్ను కోరి'తో హిట్ కొట్టిన నాని .. 'మిడిల్ క్లాస్ అబ్బాయి'తో హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.   

More Telugu News