Allu Arjun: బన్నీ సినిమాకి అనూ ఇమ్మాన్యుయేల్ ఖరారైంది!

'దువ్వాడ జగన్నాథం' హిట్ కావడంతో అల్లు అర్జున్ మాంచి జోష్ తో వున్నాడు. ఆ ఉత్సాహంతో ఆయన తన తదుపరి సినిమాను ప్రారంభించనున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. వచ్చేనెల మొదటివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

ఇక ఈ సినిమా కథానాయిక పాత్ర కోసం కొంతమంది పేర్లను పరిశీలిస్తూ వచ్చారు. అనూ ఇమ్మాన్యుయేల్ ను తీసుకునే అవకాశాలు వున్నట్టుగా వార్తలు వచ్చాయి. చివరికి ఆ అమ్మాయినే ఖరారు చేశారనేది తాజా సమాచారం. 'మజ్ను' సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న అనూ ఇమ్మాన్యుయేల్ .. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ సరసన ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. విశాల్ శేఖర్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. 

More Telugu News