nani: మళ్లీ నాని సినిమాలో నివేదా థామస్ కి ఛాన్స్?

వెండితెరపై ఒక జంట .. కనుల పంటగా కనిపించిందన్నా .. ఓ రెండు మూడు సక్సెస్ లు సాధించిందన్నా, ఇక ఆ జంటతో సినిమాలు చేయడానికే దర్శక నిర్మాతలు ఆసక్తిని చూపుతుంటారు. నాని .. నివేదా థామస్ ల విషయంలో అలాగే జరుగుతోంది. నాని - నివేదా థామస్ ల కాంబినేషన్లో వచ్చిన 'జెంటిల్ మేన్' .. ' నిన్నుకోరి' సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి.

 దాంతో నానితో మేర్లపాక గాంధీ చేయనున్న సినిమా కోసం నివేదా థామస్ పేరును పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నాని 'ఎం.సి.ఏ. మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఆయన మేర్లపాక గాంధీతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాలోనే కథానాయికగా నివేదా థామస్ ను తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం.    

More Telugu News