rajamouli: మూడు భాషల్లో .. ముగ్గురు హీరోలతో రాజమౌళి మూవీ?

రాజమౌళి తదుపరి చిత్రం ఏమిటనేది ఇప్పుడు అందరిలోను ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆయన నెక్స్ట్ మూవీ బాలీవుడ్లో వుంటుందనీ .. అక్కడి యంగ్ హీరోలు ముగ్గురు ఈ సినిమాలో నటించే ఛాన్స్ ఉందంటూ వార్తలు వచ్చాయి. ఇక తెలుగులోను ఎన్టీఆర్ - మహేశ్ బాబు కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ చేసే ఛాన్స్ ఉందనే వార్త కూడా వినిపించింది.

అయితే ఆ ప్రచారంలో నిజం లేదంటూ తాజాగా మరో వార్త వినిపిస్తోంది. రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని తెలుగు . తమిళ .. మలయాళ భాషల్లో ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఒక్కో భాషలో ఒక్కో హీరో ఉంటాడని అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కథను పూర్తి చేసే పనిలో విజయేంద్ర ప్రసాద్ ఉన్నారట. కథ పూర్తి కాగానే నటీనటుల ఎంపిక మొదలవుతుందని అంటున్నారు. ఇక ఈ ప్రచారంలో నిజమెంతవరకూ వుందో చూడాలి. 

More Telugu News