mahesh babu: 'సితార' బర్త్ డేకి మహేశ్ ఫ్యాన్స్ కి స్పెషల్ గిఫ్ట్!

మహేశ్ బాబు .. మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న 'స్పైడర్' అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు లుక్ .. టీజర్ కి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఆ తరువాత రానున్న మరో టీజర్ .. ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

 ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఆ రోజున మహేశ్ బాబు కూతురు 'సితార' పుట్టినరోజు కావడమే అందుకు కారణం. ఇక వచ్చేనెల 9వ తేదీన మహేశ్ బాబు పుట్టినరోజు కావడం వలన, ఆ రోజున థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేస్తారట. ఆగస్టు చివరినాటికి ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ పూర్తిచేసి, సెప్టెంబర్ 27వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక త్వరలో రానున్న టీజర్ ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు పెంచుతుందో చూడాలి.    

More Telugu News