: రోజుకు ఎంత మంది నడిచి కొండెక్కినా 20 వేల మందికే దర్శనం!: టీటీడీ మరో కీలక నిర్ణయం

తిరుమల కొండకు నడిచి వస్తున్న భక్తుల సంఖ్య పెరిగిపోవడం, వారికి కేటాయించే దివ్య దర్శనం టోకెన్లతో క్యూలైన్లలోకి వెళితే ఆరేడు గంటలు దర్శనానికి వేచి ఉండాల్సి రావడం తదితర కారణాలతో వారాంతాల్లో కాలిబాట దివ్యదర్శనాన్ని ఇప్పటికే రద్దు చేసిన టీటీడీ, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాలి నడక మార్గంలో ఎంత మంది భక్తులు వచ్చినప్పటికీ రోజుకు 20 వేల మందికి మాత్రమే దర్శన సమయాన్ని కేటాయించాలని నిర్ణయించింది.

ఈ మేరకు 17వ తేదీ సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నట్టు జేఈఓ శ్రీనివాసరాజు తెలియజేశారు. ఈ 20 వేల మందికీ గరిష్ఠంగా రెండున్నర గంటల్లో దర్శనం లభించేలా చూస్తామని అన్నారు. ఇందుకోసం టైం స్లాట్ లను నిర్ణయిస్తామని, గంటకు రెండు వేల మంది చొప్పున పది గంటల పాటు దర్శనానికి పంపుతామని వెల్లడించారు.

More Telugu News